EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నల్గొండ జిల్లా బీజేపీ లో భగ్గుమన్న విభేదాలు

ఈతరం భారతం నల్గొండ డిసెంబర్ 25

నల్గొండ జిల్లాలో బీజేపీ లో విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన 17 మంది సర్పంచ్‌లకు సన్మానం చేసే విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ నేత పిల్లి రామరాజుపై ఓ వర్గం దాడి చేసింది. దాంతో జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డిపై మరో వర్గం దాడికి పాల్పడింది.ఈ ఘర్షణ గురించి తెలిసి బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్ల కెమెరాలను కొందరు నేతలు లాక్కుని డేటాను డిలీట్‌ చేశారు. అందుకు నిరసనగా జర్నలిస్టులు బీజేపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top