ఈతరం భారతం నాగార్జున సాగర్ నవంబర్ 23
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో లాంచీ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. ఈ 110 కిలోమీటర్ల జలయాత్రలో పచ్చని నల్లమల అడవులు, చారిత్రక ప్రదేశాల అద్భుత దృశ్యాలను ఆస్వాదించవచ్చు. పర్యాటకుల భద్రతకు, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రయాణాన్ని నిర్వహిస్తున్నారు. పెద్దలకు టికెట్ రేట్లు ఒకవైపు ప్రయాణానికి రూ. 2,000, రెండు వైపులా ప్రయాణానికైతే రూ.3,250గా టికెట్ రేట్లు ఖరారు చేశారు.పిల్లలకు(5-10) వన్ వే అయితే రూ.1,600, రెండు వైపులా ప్రయాణానికి రూ.2,600గా నిర్ణయించారు. టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.














