చిట్యాల ఫిబ్రవరి 21 ఈతరం భారతం:
హెయిల్ టాటామణి చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం లో నల్గొండ జిల్లా చిట్యాల పట్టణం లో , టైలరింగ్ నేర్చుకున్న (100) వంద మంది మహిళా మణులకి చారిటబుల్ ట్రస్ట్ తరఫునుంచి టైలరింగ్ సర్టిఫికెట్స్ పంపిణీ చేసారు. ఈకార్యక్రమం చిట్యాల న్యూ మున్సిపల్ చైర్మన్ పందిరి గీత , శ్రీలత, షరీఫ్ ఉన్నిసా సమక్షంలో జరిగినది.ఈ కార్యక్రమ లో హెయిల్ టాటామణి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్,చైర్మన్ సీఈవో, డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి చారిటీ మెంబర్స్ పోలంకి జగదీష్ కుమార్, ఎం మురళి, జి శశి కుమారి, జి రాజు, బి హేమలత, ఎం సావిత్రి,పి కవిత, v.జోస్ఫిన్ తదితరులు పాల్గొన్నారు.














