EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాజి మార్గమే రాజమార్గం  లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఈతరం భారతం నారాయణపేట ఏప్రిల్ 25: (ఎక్స్ ప్రెస్ న్యూస్)

రాజి మార్గమే రాజమార్గమని అందుకు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు అన్నారు.శనివారం నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశింషి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులుమాట్లాడుతూ రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. న్యాయమూర్తి మాట్లాడుతూ జూన్ 20న జరిగే లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని టీములు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. లోక్ అదాలకు కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇదివరకు జరిగిన మార్చ్ 28వ తేదీన జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించి మొత్తం 5149 కేసులు డిస్పోసల్ చేసి నారాయణపేట డిస్టిక్ 18వ ర్యాంకు స్థానంలో ఉన్నాము అనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోలీస్ అధికారులకు అభినందించారు. ఈ ర్యాంకు రావడానికి కృషిచేసిన పోలీసులు అధికారులు జిల్లా ఎస్పీ శ్రీ వినీత్ కోర్ట్ కానిస్టేబుల్ లను అభినందించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యధావిధిగాకొనసాగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో న్యాయమూ ర్తులు సీనియర్ సివిల్ జడ్జి, సెక్రటరీ డి ఎల్ ఎస్ ఏ వింధ్య నాయక్, బి.మనోజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, సుస్మిత జూనియర్స్ సివిల్ జడ్జి అవినాష్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, డీఏస్పీ , పోలీస్ సిబ్బంది, ఆర్ అండ్ బి రాములు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top