ఈతరం భారతం/ నిర్మల్/ అక్టోబర్ 27 :
ఆమె నిన్నటి దాకా మద్యం వ్యాపారి కాదు. ఈ ఏడాది ప్రభుత్వం పిలిచిన మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొన్న ఆమెకు ఏకంగా రెండు దుకాణాలు దక్కాయి. రెండు దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఆమెకు అదృష్టం తలుపు తట్టింది. రెండింటా లక్కీ డ్రా లో విజేతగా నిలిచింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక అనే మహిళ లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేసింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో నేడు లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలు ఖరారు చేయగా ఆమె రెండు షాపులు దక్కించుకున్నది. ఈ సందర్భంగా లక్కీ లేడీ అంటూ ఆమెను అక్కడ ఉన్నవారు అభినందించారు.














