EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బాసర ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఘనంగా మాసోత్సవం 

ఈతరం భారతం బాసర డిసెంబర్ 9 :

శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో చదువుల తల్లి బాసర మహా సరస్వతి దేవాలయం సమీపంలో గల శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము( కోటి పార్ధివ లింగస్థూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము) మాసోత్సవమ మరియు ఆరుద్ర నక్షత్ర ప్రయుక్తముగా ప్రత్యేక పూజా కార్యక్రమములు ,హోమములు అన్నదానము ఘనంగా నిర్వహించారు.ముందుగా కలశస్థాపన, విఘ్నెశ్వర పూజ శ్రీ మహా గణపతికి ,శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మరియు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారికి మహా రుద్రాభిషేకం, భస్మార్చన ,గణపతి ,నవగ్రహ ,సరస్వతి ,మేధా దక్షిణామూర్తి ,రుద్రహోమములు , గోపూజ నిర్వహించారు .సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులు ఆదిశ్రీ కూచిపూడి అకాడమి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి శ్రీవల్లి పారంకుశం మరియు శ్రీ మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జి వి మోహనరావునాట్యాచార్యుల శిష్యులచే నృత్యకళార్చన నిర్వహించారు. మరియు నాట్య గురువులకు ఉత్తమ సాంస్కృతిక నాట్య సేవా పురస్కారము మరియు నాట్య కళాకారులకు ప్రశంసా పత్రాలు ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీ నిర్మల అంబికానాధ శర్మ సంధ్య దంపతులు అందజేశారు. జిడిగె రాజేశం విమల దంపతులు అన్నదానం కార్యక్రమం చేశారు. ప్రముఖ వైశ్య ప్రముఖులు గాదె ప్రవీణ్, శ్రీదేవి ,నూకల గణేశ్ అన్నపూర్ణ , పల్లికొండ రాజేందర్ తుకారాం గందే వార్ , శక్కరి గోవర్ధన్ పద్మ ,దంపతులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top