బాసర ఫిబ్రవరి 23 ఈతరం భారతం:
బాసర క్షేత్ర స్థిత శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము మరియు శైవ మహాపీఠం జంట నగర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ దీనదయాళ్ నగర్ లోని విజయ వినాయక దేవాలయంలో సామూహిక ఉచిత బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినవి. శ్రీ శారదాంబ వేద విద్యాలయం మరియు శ్రీ వేంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం ఘన పాటులు వచ్చి ఉపనయనము చేసుకున్న బ్రాహ్మణ వటువులను వేద స్వస్తి తో ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ వాస్తు శాస్త్రజ్ఞులు మరియు శైవ మహాపీఠం అధ్యక్షులు ఎం. ఎం. వి .రావు కి ఉత్తమ ఆధ్యాత్మిక సామాజిక సేవా పురస్కారాన్ని శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల సంధ్యా అంబికానాధ శర్మ లు అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కోటేశ్వర ప్రసాద్,ములుగు మల్లికార్జున ,తాటికొండ నాగ మల్లికార్జున వీర భద్ర ప్రసాద్, యువటూరి అభిషేక్, మంచళ్ళ శ్రీనివాస్ రావు, బాలసుబ్రమణ్యం గణేష్,జగర్లపూడిశ్రీనివాసరావు, అన సింగరాజు అరగోపాలరావు ,కుందర్తి సత్య ప్రభు, ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.














