ఈతరం భారతం నిజామాబాద్ ఏప్రిల్ 6
నిజామాబాద్ వేదికగా నిర్వహించిన డాడీ బంజారాల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మహారాష్ట్ర, ముంబై, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి అతిథులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రాష్ట్ర కమిటీ సమన్వయంతో నిర్వహించిన ఈ సమ్మేళనం ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది. రాబోయే రోజుల్లో పేద-ధనిక తేడా లేకుండా విద్య, వైద్యం మరియు సేవా కార్యక్రమాల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ధాడీ బంజారా అధికారిక వెబ్సైట్ను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధోన్వాన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా సమాజానికి సంబంధించిన సమాచారం, విద్య, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.అదే విధంగా, ఈ వెబ్సైట్లో వివాహాల కోసం ప్రత్యేక మ్యాట్రిమోనీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.అలాగే, ఏఐడిబీఎస్ఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టు రమేష్ , నేషనల్ మెంబర్ భట్టు రమణ , రాష్ట్ర అధ్యక్షులు భానవత్ స్వామి నాయక్ మరియు రాష్ట్ర, జాతీయ, జిల్లా నాయకులు వెబ్సైట్ అభివృద్ధికి పూర్తి మద్దతు ప్రకటించారు.త్వరలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి సమాజానికి మరింత చేరువగా సేవలు అందించనున్నట్లు కమిటీ వెల్లడించింది.














