EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కుంభమేళాను తలపించే స్థాయిలో 2027 గోదావరి పుష్కరాలు

ఈతరంభారతం పెద్దపల్లి, మే 31:

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధి కోసం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఆదివారం మంథని బస్టాండ్ అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,  దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మంథని బస్టాండ్లో రెండు అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రూ.74 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.19 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.అలాగే 2027లో జరగనున్న  గోదావరి పుష్కరాల ను కుంభమేళాను తలపించే స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.మంథని గోదావరి తీర ప్రాంతానికి అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్ నిర్మాణ పనులు త్వరలో వేగవంతం చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు, యాత్రికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Related News

Select the Topic
Scroll to Top