ఈతరంభారతం రాజన్న సిరిసిల్ల జులై 20
విక్రమ్-1 రాకెట్ మిషన్‌లో రాజన్న సిరిసిల్లకు చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించారు .శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగమైన స్కైరూట్ ఏరోస్పేస్ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1.దీనికి ఆడుప సంతోష్ అవియానిక్స్ చెక్‌అవుట్ లీడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రయోగానికి ముందు అవియానిక్స్ వ్యవస్థల తనిఖీలు, కీలక పరీక్షలకు నాయకత్వం వహించాడు ఆడుప సంతోష్.రాకెట్ CAD డిజైనర్‌గా విక్రమ్-1 రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు.ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థల సమీకరణ బాధ్యతలు నిర్వహించిన బొమ్మదేని నాగరాజు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు విక్రమ్-1 విజయగాథలో భాగస్వామ్యం అయ్యారు.సిరిసిల్ల యువ ఇంజనీర్ల ప్రతిభపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.















