ఈతరంభారతం సెప్టెంబర్ 6 : వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని యాదాద్రి భువనగిరి భువనగిరి జిల్లా కాచారం లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వ్యవస్థాపక అధ్యక్షుడు,వాసవి ఉపాసకులు,ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి శనివారం దర్శించుకున్నారు.రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి అనుగ్రహంతో ప్రజలంతా బాగుండాలని, సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి పండిన పంటలకు సరైన ధరలు లభించాలని స్వామివారిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు.














