EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హయత్ నగర్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు బిజెపి మద్దతు

ఈతరం భారతం హయత్ నగర్,రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 24:

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన సంఘీభావ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా దివంగత ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు తక్షణమే ₹1 కోటి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమ పోరాటం మరువలేనిది. ఆర్తి తెలంగాణ ఉద్యమకారుల ఉసురు ఆర్టీసీ ఉద్యమకారుల ఉసురు తప్పక తగులుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అని అన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన 5 ముఖ్య హామీలను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు.

టీఎస్ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం ప్రధాన డిమాండ్లు:

• ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేసి, రెండు PRC బకాయిలను తక్షణమే చెల్లించాలి.

• వచ్చే PRC పరిధిలోకి TSRTC కార్మికులను తీసుకురావాలి.

• రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పించాలి.

• ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరించి, అధునాతన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభించాలి.

• ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇవ్వాలన్నారు

అంతేకాకుండా, ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, వెంటనే పరిష్కరించకపోతే మరింత ఉద్ధృతమైన ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు.

Related News

Select the Topic
Scroll to Top