EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గ్యాస్ సిలిండర్లు లేవు …ఆగ్రహంలో వినియోగదారులు…

ఈతరం భారతం సంగారెడ్డి ఏప్రిల్ 14

సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలో ప్రజలకు గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసి 20 రోజులు గడుస్తున్నప్పటికీ, గ్యాస్ ఇవ్వడం లేదంటూ వినియోగదారులలు ఆరోపిస్తున్నారు. పుల్కల్ మండలంలోని వివిధ గ్రామాలకు గ్యాస్ సరఫరా చేస్తున్న భారత్ గ్యాస్ ఎజెన్సీ నిర్వహకులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి. గ్యాస్ ఏజేన్సీ యాజమాన్యం నిర్లక్షం కారణంగా రోజుల తరబడి గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నామని వినియోగదారులు బాధను ,కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు

..మండలంలోని గొంగ్లూరు గ్రామంలో భారత్ గ్యాస్ గోడాంకు సిలిండర్ల లోడు లారీ వస్తుందన్న విషయం తెలుసుకున్న వినియోగదారులు మంగళవారం తెల్లవారుజాము నుండి ద్విచక్ర వాహనాలు, కార్లపై ఖాళీ సిలిండర్లను తీసుకుని క్యూ లైన్లలో బారులు తీరారు. ఉదయం నుంచే గోదాం వద్ద భారీ రద్దీ నెలకొనడంతో కొద్దీ సేపు సిలిండర్ల కోసం గలాట నెలకొన్నది. సిలిండర్ల లోడు లారీ అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్న మరి కొంత మంది వినియోగదారులు గొంగూరు గోదాం వద్దకు తరలివచ్చారు.

మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు సైతం గంటల తరబడి మంటుటెండలో క్యూలో వేచి ఉండాల్సి దుస్థితి నెలకొన్నది. గొంగ్లూరులోని భారత్ గ్యాస్ గోదాంకు సిలిండర్ల లోడు లారీ రావడంతో కొంత మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్లు దొరకడంతో మరి కొంత మందికి దొరకకపోవడంతో గ్యాస్ ఏజేన్సీ నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ గోదాం వద్ద కనీసం తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, దాహంతో అల్లాడి పోతున్నామని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరత లేకుండా గ్యాస్ సరఫరాను నిరంతరం కొనసాగించాలే అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top