EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

ఈతరం భారతం సంగారెడ్డి మే 22 :

చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని టీజీ ఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధి లోని గొల్లపల్లి, కొండాపూర్ గ్రామాలలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంతగా జొన్నల కు ప్రభుత్వం రూ 2699 మద్దతు ధర కల్పించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్ష పాతి అని, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రతి ఒక్కరు తమ ధ్యానాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలన్నారు. రైతులు ధాన్యం తీసుకువచ్చే సమయంలో వ్యవసాయ విస్తరణ అధికారి పంట సాగు ధృవీకరణ,పట్టా పాస్ బుక్ జిరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. రైతులు ధాన్యం విక్రయించిన 72 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయాలని సూచించారు. ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రతి కేంద్రంలో గన్ని బ్యాగులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆత్మ కమిటీ చైర్మెన్ ప్రభు, సొసైటీ చైర్మెన్ లు శ్రీకాంత్ రెడ్డి, మాణిక్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు నర్సింహ రెడి, నర్సింలు, వెంకటేశం గౌడ్, జాకీర్,ప్రభుదాస్ , విఠల్ రెడ్డి, తది తరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top