EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పండుగలు…పూర్వీకులు మనకు ఇచ్చిన కానుకలు

ఈతరం భారతం సంగా రెడ్డి జనవరి 16

సంగారెడ్డి రామ్ నగర్ రామ్ మందిర్ లో జగ్గారెడ్డి ఆధ్వర్యం లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా తన చిన్ననాటి మిత్రులతో కలిసి పతంగులు ఎగరవేశారు. అనంతరం పాత పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఉదయం 12 గంటలకు మొదలుకుని సాయంత్రం 5 గంటల వరకు ఈ సంబరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు మనకు పూర్వీకులు ఇచ్చిన కానుకలని, కష్టాలను, బాధలను మర్చిపోయి పండుగ రోజు అందరూ కుటుంబాలతో సంతోషంగా గడుపుతారన్నారు. సంక్రాంతి పండుగ ను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు కూన సంతోష్, కిరణ్, రామ్ మందిర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top