EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకోడానికే కగార్” పేరు తో ఎన్కౌంటర్లు      రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు దుర్గం సైదులు

ఈతరం భారతం సూర్యాపేట నవంబర్ 22

భారత విప్లవోద్యమంనేత కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి 41 వ వర్ధంతి సభలు ఆంధ్ర. తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రాలలో సభలు సమావేశాలు జరపాలని కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రామనర్సయ్య నగర్ లో రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు దుర్గం సైదులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. నవంబర్ మాసంలో అనేకమంది విప్లవోద్యమ నేతలు కామ్రేడ్ రామ నర్సయ్య. జెసిఎస్ ప్రసాద్ .బూటకపు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. భూమి బుక్తి విముక్తి కొరకు గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్నీ ముందుకు తీసుకువెళ్లాలని వక్తలు మాట్లాడారు. నవంబర్ 22 ఇదే రోజున శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో అమరులైనారు. అతివాదన్నీ మితవాదాన్ని ఓడించి సరియైనటువంటి పంథా గోదావరి లోయ రైతాంగ ప్రతిఘటన పోరాటమే శరణ్యమని కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి ఆచరణలో నిరూపించారు. దేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మనువాదం. హిందూ ఫాసిజం పేరుమీద అనేక విద్వాంసాలు సృష్టిస్తున్నది. “కగార్” పేరు మీద అనేక ఎన్కౌంటర్లను చేస్తూ ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకోవాలనీ బహుళ జాతి కంపెనీలకు. ఆదాని .అంబానీలకు. దారాదత్తం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గిరిజన మరియు ఆదివాసిలను .అనేక హింసలు పెడుతున్న పరిస్థితి దేశంలో కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ హెడ్మాను పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపడాన్ని సిపిఐ CPI(ML) చండ్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లు అన్నింటినీ కూడా ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తూ సెట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం . పోలీసుల చేతిలో ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి కామ్రేడ్ బుద్ధ సత్యనారాయణ గారు. రాష్ట్ర రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి నకిరేకంటి చిట్టిబాబు గారు. పిఓడబ్ల్యూ స్త్రీ(విముక్తి) తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కన్వీనర్ వెలుగు వనితక్క. ప్రసంగించారు. ఈ సమావేశంలో సుధాకర్ పద్మ యామిని. వెంకన్న దేవమ్మ సీత తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top