EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సూర్యాపేట జిల్లాలో దారుణం. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం

ఈతరం భారతం సూర్యాపేట ఆగస్ట్ 22 : సూర్యాపేట జిల్లాలో దారుణం.పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం.బైక్ పై వెళ్తున్న ముగురిని చంపేందుకు కారులో వెంబడించిన ఐదుగురు వ్యక్తులు.సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ ముందు బైక్ బయటపడవేసి అందోళనతో వైన్స్ లోపలికి వెళ్లిన ఆ ముగ్గురు.బైక్ ను చూసి కారు నుండి దిగి ఆముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తున దుండగులు.వైన్స్ షాప్ లో ఉన్న వారు అకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయిన దుండగులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవల సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ సమీపంలో ఒక ట్రాక్టర్ షోరూం లో పనిచేస్తున్న వ్యక్తిని ఇదే మాదిరి కారులో వెంబడించి హత్యాయత్నంకు పాల్పడ్డ ఘటన మరవకముందే ఈ ఘటన జరగడం పట్ల పట్టణ ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Related News

Select the Topic
Scroll to Top