EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విజయవంతంగా ముగిసిన పది రోజుల “సంఘటన సృజన్ అభియాన్” శిక్షణ శిబిరం      పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన రాహుల్ గాంధీ

వికారాబాద్ మార్చ్ 2 ఈతరం భారతం:

వికారాబాద్ హరిత రిసార్ట్‌లో “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ , కేసి వేణు గోపాల్ , సీఎం రేవంత్ రెడ్డి విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల , ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్,తదితరులు పాల్గొన్నారు. పది రోజులపాటు కొనసాగిన ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డీసీసీ అధ్యక్షులు తమ తమ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మాణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను విశ్లేషిస్తూ అనుభవాలను పంచుకున్నారు. “సంఘటన సృజన్” ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్ రావ్ ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా వంశీ చందర్ రెడీ, ఎమ్మెల్యే పరిగి రాంమోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిబిరం సమర్థవంతంగా నిర్వహించబడింది. వివిధ రంగాల నిపుణులు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, సోషల్ మీడియా & మీడియా నిర్వహణ, ఎన్నికల వ్యూహరచన, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై శిక్షణ అందించారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో శిక్షణా శిబిరం ముగిసింది.

 

 

Related News

Select the Topic
Scroll to Top