ఈతరం భారతం వికారాబాద్ జులై 14:
వయసుతో సంబంధం లేకుండా, శరీరంలో శక్తి తగ్గిపోయినా, ఆలోచనలతో, ఆనందంగా, ఉత్సాహంగా జీవించే తత్వాన్ని కలిగి ఉండడం. దీన్నే యవ్వన వృద్దాప్యం, రెండో యవ్వనం, అరవై లో ఇరవై, మనసు వయసు అని పిలుస్తారని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. నేడు డే కేర్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో సాయి చౌదరి మాట్లాడుతూ వయసు పెరిగినా, శారీరకంగా చురుగ్గా ఉండడం, నిరంతరం వ్యాయామం,నడక, యోగా వంటివి చేస్తూ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం. కండరాల బలం కోసం పప్పులు, సోయాబీన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం, ఎముకల దృఢత్వం కోసం ఆకుకూరలు, పాలు పెరుగు మరియు మలబద్దకం నివారణకు పీచుపదార్థాలు తీసుకోవడం మరియు డీహైడ్రేషన్ రాకుండా మంచినీరు, ద్రవపదార్థాలు తీసుకోవడం చేయాలి అని సాయి చౌదరి అన్నారు. వృద్ధాప్యం లో 7 to 9 గంటలు నిద్రపోవడం వల్ల శరీరం రీచార్జ్ అయి అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని, జీవిత గమనం లోని గతం తాలూకూ చేదు అనుభవాల పరంపరను మెదడు నుంచి డిలీట్ చేసి, మంచి అనుభవాలను మననం చేసుకుంటూ వర్తమానం లో జీవిస్తూ ఉండాలి అని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి పేర్కొన్నారు. భౌతికంగా వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే, ఒక వ్యక్తి జీవనశైలి సక్రమంగా ఉంటే అతని బైలాజికల్ వయసును భౌతిక వయస్సు కంటే తక్కువగా ఉంచుకోవచ్చు అని నిత్యనూతన ఆలోచనలు ఉన్నంతవరకు మనిషికి వృద్ధాప్యం అనేది దరిచేరదు అని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు.















