ఈతరం భారతం కొడంగల్ ఏప్రిల్ 29
సిపిఆర్ పై అవగాహన కార్యక్రమంను బుధవారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల యందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లిల్లీ మేరి కార్డియోపల్మనరీ రిసక్టేషన్ (సి. పి. ఆర్) పై మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏటా లక్షమందిలో 4,280 మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో మరణిస్తున్నారని, వీటి శాతాన్ని తగ్గించేందుకు సిపిఆర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని లిల్లీ మేరి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లిల్లీ మేరి మాట్లాడుతూ హఠాత్తుగా కుప్పకూలటం, అపస్మారక స్థితికి వెళ్లడం, శ్వాస అందకపోవడం, నాడీ కొట్టుకోకపోవడం, ఛాతిలో నొప్పి తదితర లక్షణాలు గుండెపోటుకు దారితీస్తాయని, సడన్ కార్డియాక్ అరెస్టుకు గురైతే రెండు చేతులతో సిపిఆర్ ప్రక్రియ చేపట్టి బతికించవచ్చన్నారు. బలముగా, వేగముగా చాతి మధ్యలో నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఐదు సెంటీమీటర్ల లోతులో మర్దన చేయడాని సిపిఆర్ అంటారన్నారు. ఆకస్మికంగా వచ్చే కార్డియాక్ అరెస్టుతో రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కార్డియాక్ అనేది సమయము, సందర్భము, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరికైనా సడన్ కార్డియాక్ అరెస్టు వచ్చే ప్రమాదం ఉందని ప్రిన్సిపల్ హెచ్చరించారు. అయితే సకాలంలో సిపిఆర్ చేయటం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది సూచించారు. సడన్ కార్డియాక్ అరెస్టు, హార్ట్ స్ట్రోక్లు పెరుగుతున్నాయని కండ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నారని ప్రిన్సిపల్ గుర్తు చేశారు. అయితే సిపిఆర్ చేయటం వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని లిల్లీ మేరి వివరించారు. ప్రస్తుతం కార్డియాక్ అరెస్టు అయిన ప్రతి పదిమందిలో ఒకరు మాత్రమే బ్రతుకుతున్నారని, సిపిఆర్ సకాలంలో చేస్తే కనీసం ఐదుగురిని బ్రతికించుకునే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నాయని లిల్లీ మేరి ఉదహరించారు. అనుకోని ప్రమాదాలు, దుర్ఘటన జరిగినప్పుడు మనిషి సైకలాజికల్ షాక్ కి గురవుతాడని, ఈ సమయంలో హృదయస్పందనలో తేడా వస్తుందని, గుండెలయతప్పి ఆగిపోతుందని, అలాంటి సమయంలో మనిషి స్పందించడని, శ్వాస ఆగిపోతుందని, ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శాసన అందించడం వల్ల గుండె, ఊపిరితిత్తులు తిరిగి పెంచేస్తాయని దీన్నే సిపిఆర్ అంటారని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి తెలిపారు. దీన్ని తెలుగులో హృదయ శ్వాస పునరుద్ధరణ అని అంటారని లిల్లీ మేరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమమునకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.














