EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

CCTNS 2.0, e-Sakshya అమలుపై రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS

ఈతరం భారతం వికారాబాద్ జూన్ 8

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖలో అమలులో ఉన్న CCTNS 2.0 మరియు e-Sakshya అప్లికేషన్ల సమర్థవంతమైన వినియోగం, తాజా అప్‌డేట్లు, మరియు క్షేత్రస్థాయి అమలుపై రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారు, జిల్లాలోని డి‌ఎస్‌పి లు , ఐటీ సెల్ ఇన్‌చార్జ్‌లు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు మరియు సంబంధిత సాంకేతిక సిబ్బంది ఈ వీడియో కాన్ఫరెన్స్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో పారదర్శకత, డిజిటల్ సాక్ష్యాల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలపై అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS  మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వినియోగించుకోవాలని సూచించారు. CCTNS 2.0 మరియు e-Sakshya ద్వారా దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుందని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా జిల్లాలోని పోలీస్ అధికారులకు CCTNS 2.0 మరియు e-Sakshya వ్యవస్థల తాజా విధానాలు, సాంకేతిక అంశాలపై మరింత అవగాహన కల్పించబడింది.

Related News

Select the Topic
Scroll to Top