ఈతరంభారతం కొయ్యలగూడెం జూన్ 23
కొయ్యలగూడెం గ్రామ పద్మశాలి కులబాంధవుడైన వర్గాల ఉపేందర్ అకాల మరణం చెందినందున చిన్న చిన్న పిల్లలు ఉన్నారని తెలుసుకొని రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల పద్మశాలి రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం వారు వీరికి కొంత ఆర్థిక సాయం చేయడానికి కొయ్యలగూడెం పద్మశాలి సంఘంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే పద్మశాలి వీవర్ అవార్డు గ్రహీత అయిన కర్నాటి ముఖేష్ ని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ స్వప్న అశోక్ , ఉప సర్పంచ్ జిల్లా పవన్, మిగతా వార్డు మెంబర్లు పద్మశాలి సంఘం కమిటీ ఆధ్వర్యంలో జరిగినది.















