EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కన్నుల పండువగా   కనకదుర్గమ్మకు సారె సమర్పణ శోభాయాత్ర

ఈతరం భారతం జూలై 26 యాదాద్రి భువనగిరి:

జిల్లా పరిధిలోని ఆలేరు లో శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం ఎంతో ఘనంగా ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. బొడ్రాయి ఆంజనేయ స్వామి ఆలయం నుండి పట్టణ వీధుల గుండా అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ వేద పండితులు ఆలేటి రంగన్న పంతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వీయ పర్యవేక్షణలో సారె మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రలో ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శన నిర్వహించారు. కనకదుర్గాదేవి ఆలయ కమిటీ మెంబర్లు, స్థానిక ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top