EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ విశిష్ట సాహితీ మూర్తులు   నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి లకు సత్కారం

ఈతరం భారతం  యాదాద్రి భువనగిరి జిల్లా ఏప్రిల్ 30:

జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో విఆర్ జూనియర్ కళాశాలలో గురువారం అనిమేష కావ్యానికి ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి కి, ఐఏఎస్ హోదా పొందిన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి కి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కారం ఘనంగా జరిగింది. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా రచయితల సంఘం, అనుబంధ సాహిత్య సంస్థల ప్రతినిధులు సిధారెడ్డి,నరసింహా రెడ్డి లను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఏ ఫలితం ఆశించకుండా కవి తన లక్ష్యం వైపు ప్రయాణం సాగించినపుడు ఇలాంటి ప్రోత్సాహకాలు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు. కవి ఎప్పటికప్పుడు లోక పరిశీలన చేస్తూ తన అభిప్రాయాన్ని కవిత్వంగా ప్రకటించాలని చెప్పారు. ఏనుగు నరసింహా రెడ్డి ప్రసంగిస్తూ తాను మొదట నుండి ఇష్టపడి చదువుకున్న ఉన్నత స్థానాలను అందించిందని అన్నారు. తెలుగు భాషా సాహిత్యాలు కవిగా ,అధికారిగా నిలబెట్టాయని తెలిపారు.కవిగానే చివరి వరకు కొనసాగాలన్నది తన అభిమతమని అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీరామోజు హరగోపాల్, అమ్మాయాది సత్యనారాయణ,డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, బండిరాజుల శంకర్, అయ్యప్ప,బండారు జయశ్రీ,ఎస్ ఎన్ చారి,అభినయ శ్రీనివాస్,దేవినేని అరవిందరాయుడు,తొర్ర ఉప్పలయ్య, పోరెడ్డి రాజేశ్వరి, గుమిడెల్లి వెంకన్న, బయ్యని రాజు,మర్రి జయశ్రీ,రామ్ ప్రసాద్,మోత్కూరు సుజాత,బైరపాక స్వామి,బాలరాజు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top