ఈతరం భారతం చౌటుప్పల్ జులై 26;
ఈ నెల 29న వేద వ్యాస మహర్షి జయంతి (గురు పూర్ణిమ) సందర్భంగా ఇంటింటా శ్రీమద్ భగవద్గీత పుస్తక ప్రసాద వితరణ కార్యక్రమమును చౌటుప్పల గాంధీ పార్కులో మధ్యాహ్నం 4:00లకు సహస్ర గృహస్థు లకు అందజేయడం మరియు శ్రీమద్భగవద్గీత అంశంపై విజ్ఞానాన్వేషణ పోటీ నిర్వహించి నగదు పారితోషకం అందజేయనున్నట్లు పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ పాలకుర్ల మురళి గౌడ్ ప్రకటనలో తెలిపారు. హైందవ ధర్మం పాటించే ప్రతి గృహస్థునీ గృహములో శ్రీమద్ భగవద్గీత ఉండాలన్నదే, పెంచాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.















