EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భారత రాజ్యాంగ నిర్మాణంఅంబేత్కర్ చేసిన కృషి ఆమోగం మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ 

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 14

యాదాద్రి భువనగిరి జిల్లా – భువనగిరి పట్టణం లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలో రోజు పొడవునా నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.ఉదయం కార్యక్రమాల భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని, అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరింపజేశారు.

తరువాత అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ , అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన విశేష కృషి, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో చేసిన సేవలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు.

“Educate, Agitate, Organize” అనే అంబేద్కర్ సిద్ధాంతం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినదని, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన దారిలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం, సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top