ఈతరం భారతం సెప్టెంబర్ 4 యాదాద్రి భువనగిరి: శుక్రవారం
______________________________________________
జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో శుక్రవారం నృత్యోత్సవ కార్యక్రమాలను వివిధ ఆలయాలలో పెద్ద ఎత్తున నిర్వహించారు. శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో హాజరైన బాల బాలికలు నృత్యాలను ప్రదర్శించారు. సుహర్షిత్, వాత్సల్య, శ్రేయాన్స్ తదితర బాలబాలికల వేషధారణ, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి సాయంత్రం ఉట్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు.















