ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జనవరి 17 :
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరుకు చెందిన కవి, రచయిత డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ ప్రసార భారతి ఆధ్వర్యంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహించనున్న జాతీయ సర్వ భాషా కవి సమ్మేళనం-2026కు అనువాద కవిగా ఎంపికయ్యారు. ఈనెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని డా. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఈ కవి సమ్మేళనంలో శ్రీనివాస్ పాల్గొని భారతీయ భాషైన కొంకణిలో రమేష్ ఘాడి రచించగా తాను తెలుగులో అనువదించిన అనువాద కవితను చదివి వినిపిస్తారు.















