ఈతరం భారతం ఆగస్ట్ 31 హైదరాబాద్ :సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ.సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలి.సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరించాలి.8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి.9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలి.10న తుది ఓటర్ల, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలి.















