ఈ తరం భారతం ఆగస్టు 31 జనగామ గ్రామం సంస్థాన్ నారాయణపురం మండలం ;:
మండల పరిది లోని జనగామ గ్రామం లో గత సంవత్సర కాలంగా స్వచ్చందంగా నిర్వహిస్తున్న కాళోజీ గ్రంధాలయానికి విజయవాడ కు చెందిన ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డా.రావి శారద 400 పుస్తకాలను కాళోజీ గ్రంధాలయానికి వితరణ చేశారు. ఈ సందర్బంగా కాళోజీ గ్రంధాలయ అధ్యక్షులు ఆందోజు నాగభూషణం మాట్లాడుతూ చదివే అలవాటు అంతరించి పోతున్న తరుణం లో గ్రామీణ ప్రాంతాలలో గ్రంధాలయం ఏర్పాటుకు పుస్తకాలను ఇచ్చి మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించడం ముదావహం అని ఈ సందర్బంగా డా . రావిశారద గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేయడం జరిగింది . గ్రంధాలయ ఉద్యమకారులు అనుముల శ్రీనివాస్ సమన్వయం చేసిన ఈ వితరణ కార్యక్రమం లో గ్రంధాలయ సభ్యులు గజవెల్లి భాస్కర్ ఎదటి తిరుమలేష్,లక్ష్మణ్,స్వప్న,రేణుక, రాణి ,సుజాత లావణ్య,పద్మ ,మహేశ్వరి,,పూజ,శ్రావణి తదితరులు పాల్గొన్నారు















