EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మర్చిపోయి 5 తులాల బంగారు గొలుసుతో వినాయకుడి నిమజ్జనం.. వెతికి ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది.

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 1 :

మర్చిపోయి 5 తులాల బంగారు గొలుసుతో వినాయకుడి నిమజ్జనం..వెతికి ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది.ఈ ఆసక్తికర ఘటన శనివారం తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు వద్ద చోటుచేసుకుంది.వనస్థలిపురం, హస్తినాపురంలోని హోం ప్రసాద్ అపార్టుమెంట్లో నివసించే గిరిజ, ఆమె కుటుంబ సభ్యులు వినాయక చవితి సందర్భంగా తమ ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామివారికి తమ ఇంట్లోని 5 తులాల బంగారు గొలుసును అలంకరించి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న కుటుంబ సభ్యులంతా కలిసి ఆ విగ్రహాన్ని తుర్కయంజాల్ మాసబ్ చెరువులో నిమజ్జనం చేశారు.నిమజ్జనం పూర్తి చేసుకుని చెరువు కట్టపైకి వచ్చిన తర్వాత కుటుంబంలోని ఒకరికి విగ్రహం మెడలోని బంగారు గొలుసు విషయం గుర్తుకువచ్చింది. దీంతో *వారంతా ఒక్కసారిగా కంగారు పడిపోయారు. వెంటనే తేరుకుని అక్కడే ఉన్న తుర్కయంజాల్ మునిసిపాలిటీ సిబ్బందికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది ఎక్స్కవేటర్ను తీసుకొచ్చి చెరువులో మునిగిపోయిన విగ్రహాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. విగ్రహం మెడలో ఉన్న గొలుసును సురక్షితంగా బాధిత కుటుంబానికి అందజేశారు. బంగారం తిరిగి చేతికి అందడంతో గణేష దయ అంటూ సంతోషించారు.

Related News

Select the Topic
Scroll to Top