ఈ తరం భారతం యాదగిరి గుట్ట సెప్టెంబర్ 1: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.ప్రస్తుతం కెనడాలోశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవాలు కొనసాగుతున్నాయి. దేవస్థానం సేవలకు ముగ్ధుడైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన తన ప్రశంసల లేఖలు పంపారు. కెనడా ప్రధాని ప్రశంసల పై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం ఆలయ ఈవో వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు.దీంతో తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు అయ్యింది.
కెనడాలోని శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై టెంపుల్ బోర్డును కెనడా ప్రధాని మార్క్ కార్నీ అప్రిషియేట్ చేశారు. ఈ మేరకు ఆదివారం యాదగిరిగుట్ట టెంపుల్ కు ఆయన రాసిన లేఖ చేరింది. కెనడాలోని ఒట్టవా నగరంలో గల లక్ష్మీ నరసింహా దేవాలయంలో ఇటీవల జరిగిన స్వామి వారి కళ్యాణం జరిగిన తీరుతెన్నులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వారి కళ్యాణం చాలా ఘనంగా వైభవముగా నిర్వహించారాని కొనియాడారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతిలోని విభిన్నత… ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రశంసించారు. కెనడాలోని హిందూ భక్తులను ఐక్యంగా చేస్తూ దైవ సంబంధిత కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న ఆర్గనైజర్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కాగా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ స్వామి వారి సేవలను రానున్న రోజుల్లో మరింత భక్తులకు అందజేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
పులకించిన కెనడాలోని భక్తులు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం కెనడా రాజధాని ఒట్టావా లో గత శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ _కెనడా అసోసియేషన్ (టిసిఎ)ఆహ్వానం మేరకు…. ప్రభుత్వ అనుమతులతో ఆలయ ఈవో ఎస్. వెంకట్రావు ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఏఈవో గజవెల్లి రఘు, దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హిందూ ధర్మ ప్రచారకులు మాజీ ఎంపీ చంద్ర ఆర్య, కరుణాకర్ రెడ్డి పాపల, తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. అక్కడి తెలుగు వారితో సహా కెన డా ప్రజలు కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా తిలకించి పులకించిపోయారు.















