EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖానాపురం హవేలీ ఎస్‌ఐ ఔదార్యం – దహన సంస్కారాలకు ఆర్థిక సాయం

ఈతరంభారతం  ఖమ్మం సెప్టెంబర్ 1:దానవాయిగూడెం : పాలేరు నియోజకవర్గంలోని 59వ డివిజన్ దానవాయిగూడెం కాలనీలో విషాదం నెలకొంది. స్థానికుడు బొడ్డు కృష్ణ సోమవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో తలకు రాయి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ నేపథ్యంలో పంచనామా నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్న ఖానాపురం హవేలీ ఎస్‌ఐ శ్రావణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబ పరిస్థితులు స్థానికుల ద్వారా తెలుసుకుని దహన సంస్కారాలకు తనవంతు సాయంగా రూ.5 వేలు అందజేశారు.స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా కృష్ణ తదితరులు కూడా అక్కడ పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఎస్‌ఐ ఔదార్యానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top