EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించిన కొత్త యూనిట్‌

హైద‌రాబాద్ సెప్టెంబర్ 2 (ఈతరం భారతం); : ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కీటెక్స్ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని కొత్త యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. ఈ కీలక పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు.ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా తన సంతోషాన్ని కేటీఆర్ పంచుకున్నారు. ఈ వార్త తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న క్లిష్ట సమయంలో కీటెక్స్ అధినేత సాబు జాకబ్‌తో జరిపిన వాట్సాప్ చర్చలు తనుకు ఇంకా గుర్తున్నాయన్నారు. కేరళ నుంచి కీటెక్స్‌ను తెలంగాణకు రప్పించడానికి చేసిన ప్రయత్నం అంతా ఇంకా తన కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. కీటెక్స్‌తో వందలాది తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్న తన నమ్మకం వృథా కాలేదన్నారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించడంపై కీటెక్స్ యాజమాన్యానికి, ఉద్యోగులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అందుకోవాలని ఆకాంక్షించారు.కేసీఆర్ దార్శనికతకు దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ అయిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ నిలువుటద్దం అని కేటీఆర్ అన్నారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, కేసీఆర్ నాయకత్వం, అవినీతిరహిత పాలనతోనే కీటెక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణకు తరలివచ్చిందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక ప్రగతిలో కీటెక్స్ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు

.

 

Related News

Select the Topic
Scroll to Top