EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కళలకు వెలుగు దిద్దిన తపశ్రీ చక్రాల లక్ష్మీకాంతం :డి ఎస్ వి శాస్త్రి 

హైదరాబాద్ సెప్టెంబర్ 2 (ఈతరం భారతం);సహస్ర చంద్ర నిత్య కృషివరుడు కళలకు విలుగు దిద్దిన తపశ్రీ చక్రాల లక్ష్మీకాంతం అని ముఖ్యఅతిథి శాస్తి అన్నారు. శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దర్శకులు చక్రాల లక్ష్మీకాంత శర్మ రచించిన శ్రీరామ సుగ్రీవ మైత్రి పౌరాణిక నాటకాన్ని మానస ఆర్ట్ థియేటర్స్ 44వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ త్యాగరాయ గణ సభలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం డీఎస్ వి శాస్త్రి హాజరై చక్రాల లక్ష్మీకాంత శర్మకు జీవన సాఫల్య పురస్కారాన్ని, పౌరాణిక నాటక కళా శిరోమణి బిరుదును ప్రధాన చేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రచన దర్శకత్వంలో నిబద్దతలో తపస్వేగా రాణిస్తున్న చక్రాల వారి జీవిత జీవితం సార్ధకం అని అన్నారు .వెంకట శివ ప్రసాద్, ముదిగొండ విశ్వేశ్వర శర్మ, జొన్నలగడ్డ జగన్మోహన్రావు, మల్లాది భాస్కర్ ,అంబల్ల జనార్ధన్, నేరెళ్ల ,మల్యాలద్రి , కళ్యాణ శ్రీ, ఉమ్మడి సింగ్ రాఘవరావు, నాగచంద్ర శేఖర్ తదితరులు ప్రసంగించారు, ఈ సందర్భంగా చక్రాల లక్ష్మీకాంత శర్మ రచించిన శ్రీరామ సుగ్రీవ మైత్రి నాటక ప్రదర్శన జరిగింది. పప్పుల శ్రీనివాస్ సంగీతాన్ని, పరమేశం ఆహార్యాన్ని అందించారు. కిషోర్ కుమార్(శ్రీరాముడు) దేవసేన( సీత) జీకే పని (ఆంజనేయుడు) రత్నాకర్ (సుగ్రీవుడు) తిరుమలంబి (సూర్పనక) భరద్వాజ్ (మారీచుడు ) జిఎస్ కుమార్ (అగస్త్యుడు) పాత్రలతో నాటకాన్ని రక్తికట్టించారు.మానస ఆర్ట్రఘు శ్రీ, ఆర్గనైజర్ నాగచంద్రశేఖర్, బి రామ్మూర్తి, కోకా భవాని సహాయకారం అందించారు

Related News

Select the Topic
Scroll to Top