EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పంటల డిజిటల్ సర్వేతో పథకాల రూపకల్పన 

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 2 (ఈ తరంభారతం);:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వానాకాలం 2025 సంవత్సరానికి గాను డిజిటల్ పంటల సర్వే గత ఆగష్టు 26 తేదీ నుండి ప్రారంభించారు ఈ సర్వే ద్వారా రైతుల భూములపై పండుతున్న పంటల వివరాలు ,భూమి వివరాలు వంటి డేటాను సేకరిస్తున్నారు.ఈ పంటల వివరాలు సాంకేతిక పద్ధతిలో నమోదు చేయడం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం .ప్రతి ఖాతాదారుడు భూమి పై నాటిన పంటలను కచ్చితంగా నమోదు చేసుకోవాలి.వ్యవసాయ శాఖ డేటా ఆధారంగా ఇతర ప్రభుత్వ పథకాలు, విధానాలు రూపొందించడం , ఆ యొక్క పథకాల అమలులో ఈ డిజిటల్ క్రాప్ సర్వే కీలక పాత్ర పోషిస్తాయి .ఇది ఒక ప్రత్యేక ఆప్ ద్వారా చేయబడుతుంది ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీమతి శాంతి నిర్మల సోమవారం సైదాపూర్ గ్రామంలో నిర్వహింపబడిన డిజిటల్ క్రాఫ్ట్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి సుధారాణి, ఏఈఓ శ్రీ వీరన్ కుమార్ పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top