EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైఎస్సార్ కు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నివాళి 

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 2 (ఈ తరం భారతం);:డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆ దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. అభివృద్ధి , సంక్షేమం పై దృష్టి పెట్టి జన నేతగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన కొనియాడారు.హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన అధికార నివాస గృహంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధించాలన్నారు. పేద ప్రజలకు మేలు చేయాలనే తపన.. మాటకు కట్టుబడే మనస్తత్వం.. ఆప్యాయత.. కలబోసిన దరహాసం వైఎస్సార్ సొంతమన్నారు. ఆ మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని అన్నారు .

Related News

Select the Topic
Scroll to Top