యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 3 (ఈ తరం భారతం);: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక దిగ్విజయంగా కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ లింగస్వామి ఎప్పటి కప్పుడు జరుగుతున్న ప్రణాళిక పనులపై అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తో సమీక్షలు నిర్వహిస్తూ… ఆయా స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. బుధవారం యాదగిరిపల్లి 2వ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహింప జేశారు. ఆయన ఆధ్వర్యంలో తడి చెత్త, పొడి చెత్త పై, హోమ్ కంపోస్ట్ చేసే విధానము పై అవగాహన, రోడ్లు శుభ్రం చేయుట, పరిసరాలు శుభ్రంగా ఉంచుకొనుట, ప్లాస్టిక్ వాడకం నిషేదించుట గురించి,సీజనల్ వ్యాధుల పై అవగాహన కలిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సురేందర్, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ వార్డ్ ఆఫీసర్లు, ఏలిమినేటీ మాధవరెడ్డి, R నర్సింహా ఝాన్సీ రాణి, , సరస్వతి,కవిత, కె.శ్రీనివాస్, కే. కృష్ణ, డి.కృష్ణ, ఎన్.ఇస్తారీ , ఎన్. నర్సింహా మానస, రిసోర్సెస్ పర్సన్లు అండాలు, భాగ్య, నాగమణి,సత్యవతి యాస్మిన్ లు, బిల్ కలెక్టర్ రాజశేఖర్, వాటర్ మెన్, వార్డ్ ప్రజలు మిరియాల అండాలు, మోతే నర్సమ్మ,చంద్రమ్మ, లక్ష్మి, అలలుయ, ప్రవీణ్,చంటి, శ్రీను, దశరథ తదితరులు పాల్గొన్నారు















