ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 3 : బీఆర్ఎస్ సస్పెండెడ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. పార్టీలో చేరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోరాడుదామని ఆయన చెప్పారు. ‘నా పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలి. ప్రజల్లో మీపై ఆత్మవిశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజాశాంతిలో చేరాలి’ అని ఆయన పేర్కొన్నారు.















