EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అధర్మాన్ని సహించం… అన్యాయాన్ని ఉపేక్షించం యాడ్ ఏజెన్సీ లైటింగ్ బోర్డుల తొలగింపును సాధించిన బీజేపీ

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 4 (ఈతరం భారతం): యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం బస్టాండ్ దగ్గర బిజెపి నాయకులు స్వీట్లు పంచుకొని, బాణసంచా పేల్చి , ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య ఈ విషయమై మాట్లాడుతూ… శ్రీ స్వామి వారి విద్యుత్ స్తంభాలకు యాడ్ ఏజెన్సీ లైటింగ్ బోర్డ్ లు అక్రమంగా అమర్చి.. దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. దీనిపై బీజేపీ మూడు నెలలుగా గట్టిగా పోరాటం చేస్తూ ఈఓ కు ,ఎండోమెంట్ కమిషనర్ కు ,ప్రిన్సిపల్ సెక్రెటరీ కి ,ఎండోమెంట్ మంత్రివర్యులుకి ,సీఎం పేషీ లో కూడా ఫిర్యాదు చేసి… ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించి.. పోరాటం చేసిన ఫలితంగా గత రాత్రి ఆ లైటింగ్ బోర్డులను దేవస్థానం ఈవో తొలగింప చేసినారు. దీనిపై తమ బీజేపీ శ్రేణులం హర్షం వ్యక్తం చేస్తున్నాం …ఇలాగే ఇక ముందు కూడా అవినీతిపై పోరాటం చేస్తూ… తమపై లేనిపోని నిందలు చేసేటువంటి వివిధ రాజకీయ పార్టీలకు మరొకసారి హెచ్చరిస్తున్నాం… తాము ఎప్పుడూ ధర్మం వైపు నిలబడతాం అని కాదూ రి అచ్చయ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ ,మండల మాజీ అధ్యక్షుడు గుంటుపల్లి సత్యం ,జిల్లా కౌన్సిలర్ ఆకుల చంద్రమౌళి ,పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్ ,కార్యదర్శి దొమ్మాట ప్రభాకర్ ,సురేష్ ,సీనియర్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్ ,రంగ సత్యం ,అశోక్ , బుచ్చిబాబు ,నల్ల వాసుదేవ రెడ్డి, శ్రీశైలం ,కార్తీక్ ,విజయ్ ,వంశీ ,అనిల్ ,చందు ,బాలు ,సంద ప్రవీణ్ ,కర్రే శ్యామ్ ,శ్రీనాథ్ ,మల్లేష్ ,తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top