ఈతరం భారతం సెప్టెంబర్ 4 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గురువారం విస్తృతంగా పర్యటించారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత సుజాతనగర్ లోని రైతు వేదికలో సుజాతనగర్, సింగభూపాలెం, గరీబ్ పేట, లక్ష్మీదేవి పల్లి గ్రామపంచాయతీల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత.. లక్ష్మీదేవి పల్లి లోని గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపై నిర్మించిన మీటింగ్ హాల్ ను ప్రారంభించారు. లక్ష్మీదేవి పల్లి మండలం లోని అనిశెట్టిపల్లిలో అంగన్వాడి భవనాన్ని, చుంచుపల్లి మండలం ధన్ బాద్ లో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంకా..చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్ లో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి, సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చుంచుపల్లి మండలం రాంపూర్ లో గ్రామపంచాయతీ కార్యాలయం, విద్యానగర్ కాల నీ బైపాస్ మార్గంలో నర్సింగ్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. ఇంకా.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారని. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.















