04-09-2025 ఈతరంభారతం ఖమ్మం :వాసవి వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సందర్భంగా వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షులు పసుమర్తి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో రాఘవ మహాల్ రోడ్డు లోని ఆఫీసులో న్యూస్ పేపర్ బాయ్స్ కి (5) ఘనంగా సన్మానం మరియు స్వీట్ బాక్సులు పంపిణీ జరిగిందిి. దానికి వారు స్పందించి వారి సేవలకు సన్మానం చేసినందుకు వాసవి క్లబ్ వారికి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన ఇంటర్నేషనల్ అధ్యక్షులు వారికి మరియు గవర్నర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం ఉమ్మడి జిల్లా వాసవి క్లబ్స్ గవర్నర్ శ్రీ కొత్త వెంకటేశ్వరరావు మరియు క్యాబినెట్ కోశాధికారి శ్రీ గుంటుపల్లి దివాకర్ గుప్తా మరియు ఖమ్మం వాసవి క్లబ్ సెక్రటరీ వే చ్చా కృష్ణమోహన్ కోశాధికారి పసుమర్తి శ్రీనివాసరావు తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు















