ఈతరం భారతం ఆలేరు సెప్టెంబర్ 4 :
యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో గురువారం రాత్రి వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. వివిధ పార్టీల లో ప్రతిష్టించిన విగ్రహాలను శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. మంగళహారతులతో మహిళలు తరలివచ్చి వినాయకునికి వీడ్కోలు పలికారు. గోధుమకుంటలో విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది.















