ఈతరం భారతం సెప్టెంబర్ 5 యాదాద్రి భువనగిరి:
జిల్లా పరిధిలోని ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కోట శ్రీనివాస్ శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు- 2025 ను అందుకున్నారు. విద్యా బోధనా రంగంలో శ్రీనివాస్ అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించింది.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో అవార్డుకు ఎంపికై శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలోకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, డీఈఓ సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డును శ్రీనివాస్ అందుకున్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ వార్డున అందుకున్న శ్రీనివాస్ కు ఎంఈఓ ఎర్ర లక్ష్మి,పలువురు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.















