EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైభవంగా శ్రీ భగత్ సింగ్ యూత్ వినాయక నిమజ్జనోత్సవం 

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 6 :యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద శ్రీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాన్ని శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం జరిపారు. అంతకుముందు వేద పండితులు ఆలేటి రంగన్న ఆధ్వర్యంలో పూజను నిర్వహించారు. శోభాయాత్రలో యూత్ సభ్యులు, స్థానికులు నృత్యాలు చేస్తూ ఘనంగా గణపతికి వీడ్కోలు పలికారు. బొట్ల విశ్వేశ్వర్, పరమని స్వామి, సబ్బన్ సుభాష్,పాశి కంటి రాములు, పాశికంటి శ్రీను, బండ శ్రీనివాస్, నరసింహులు,దయ్యాల సిద్దు లు, కుడికాల భానుచందర్, ఎండి జానీ, చిట్టిమల్ల సిద్ధులు, శీల కార్తీక్, సబ్బన్ సునీల్, ఆడేపు భరత్, కుడికాల రాకేష్, దీక్షిత, లహరి, శ్వేత, అఖిల్ తో పాటు యూత్ ప్రతినిధులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top