EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సంగమేశ్వర దేవాలయ విఘ్నేశ్వర మండప అర్చకులు మోహన్ రావు ఘన సన్మానం

సంగారెడ్డి సెప్టెంబర్ 6 (ఈతరం భారతం )సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో, శ్రీ సంగమేశ్వర దేవాలయ విఘ్నేశ్వర మండపంలో ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్న మోహన్ రావు పంతులు గారికి శాలువాతో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడికి తొమ్మిది రోజుల నుండి ఘనంగా భక్తి భజనలతో, ధూప దాప నైవేద్యాలతో, అలంకరణతో, క్రమశిక్షణతో సంస్కృతి బద్ధమైన కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ సంగమేశ్వర మందిరం ఆలయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు అందరిపై ఉంటూ దిన దిన అభివృద్ధి పథంలో ఉండాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలు ఆ గణనాథుడు ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు మరియు భక్తులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top