EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించిన మహేష్ కుమార్ గౌడ్

వరంగల్ సెప్టెంబర్ 6 (ఈ తరం భారతం)తెలంగాణ తల్లి సోనియమ్మ ఆశీస్సులతో రాహుల్ గాంధీ నాయకత్వంలోతెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న శ్రీహరి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గత ఒక సంవత్సరం కాలంలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను గ్రామ స్థాయి నుంచి మండలాలు, డివిజన్లు, జిల్లాల వరకు విజయవంతంగా చేరవేయడంలో మహేష్ కుమార్ గౌడ్ గారి పాత్ర విశేషంగా నిలిచిందని అన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదరణ, జాతీయ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ , రాహుల్ గాంధీ ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ బడుగు బలహీనవర్గాల ప్రతినిధిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలవాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తుంది. అదే దిశగా “బీసీకి ముఖ్యమంత్రి” అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలకు అవకాశం దక్కుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు .ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ అధిష్టానం ఆశీర్వాదాలు ఉండాలని రాజనాల శ్రీహరి విజ్ఞప్తి చేశారు.

Related News

Select the Topic
Scroll to Top