EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లంబాడీలు ఎస్టీలు కారు అని చెప్పడం సరైనది కాదు…. లంబాడీ జేఏసీ ఖమ్మం

ఈతరం భారతం ఖమ్మం సెప్టెంబర్ 7 : ఈరోజు ఖమ్మం జడ్పీ సెంటర్ నందు టి ఎస్ టి టి ఎఫ్ (TSTTF) రాష్ట్ర అధ్యక్షులు బానోత్ ఈరు నాయక్ మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల మీద జరుగుతున్న అసత్య ప్రచారాలు అదేవిధంగా ప్రజా ప్రతినిధులే స్వయంగా సుప్రీంకోర్టులో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని నోటీసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినందున దీనికి నిరసనగా జడ్పీ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టాచ్యు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి విభేదాన్ని చొరవ చూపి వెంటనే సమస్యను పరిష్కరించాలని రెండు వర్గాల మధ్య సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము. లంబాడీలు రాజ్యాంగబద్ధంగానే ఎస్ టి  లుగా చలామణి అవుతున్నారు. మీరు ఎస్టీలు కాదని కించపరచడం సరైనది కాదని దీన్ని లంబాడీ  జే ఏ సి ముక్తా కంఠంతో ఖండిస్తుంది. ఈ కార్యక్రమంలో బానోత్ కిషన్ నాయక్ సేవలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, భూక్యా బిక్షపతి రాతోడ్  ఎల్ హెచ్ పి ఎస్(LHPS )జాతీయ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ ఎల్ ఐ వి ఈ(LIVE )రాష్ట్ర అధ్యక్షులు, రవి రాథోడ్ గిరిజన మోర్చా, మంగ్య నాయక్ టీఎస్ టిటిఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు,రామ్మూర్తి నాయక్ ఏఐబిఎస్ఎస్ ( AIBSS) ఖమ్మం జిల్లా అధ్యక్షులు, తారా దేవి ఏఐబిఎస్ఎస్,సోమ్లా నాయక్ టి ఈ ఎస్ టి ఏ(TESTA) రాష్ట్ర కార్యదర్శి, వెంకట్రావు టి ఇ ఎస్ టి ఏ జిల్లా అధ్యక్షులు, హరి అడ్వకేట్, హీరాలాల్ గిరిజన మోర్చా, శోభన్ నాయక్ గిరిజన ఉపాధ్యాయ సంఘం, మంకీలాల్ ఎల్ ఐ వి ఈ LIVE జిల్లా అధ్యక్షులు,లక్ష్మణ్ నాయక్, బానోత్ బస్కి నాయక్AIBSS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,భీముడు నాయక్ సీనియర్ గిరిజన సంఘ నాయకుడు, రంజిత్,బద్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు

 

Related News

Select the Topic
Scroll to Top