EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుల అరెస్టు

ఈతరంభారతం ఖమ్మం సెప్టెంబర్ 8 : ఖమ్మం టూ టౌన్ పిఎస్ :వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులు అరెస్ట్.ఈరోజు అంటే 08-09-2025 న మద్యానం సుమారు ఒంటి గంట (1) సమయం లో ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన B. బాలకృష్ణ  తన సిబ్బందితో కొత్త బస్టాండ్ వెనుక వైపు గల NST రోడ్ నందు వాహనాలను తనిఖి చేస్తువుండగా, ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పై NST రోడ్ వైపు నుండి కొత్త బస్టాండ్ వైపు వస్తూ, పోలీస్ వారిని చూసి తప్పించుకు వెళ్ళే ప్రయత్నం చేయగా, అనుమానం తో వారిని పట్టుకొని, వారివద్ద నున్న బ్యాగ్ ను చెక్ చేయగా దొంగిలించిన బంగారు మరియు వెండి వస్తువుల తో పట్టుబడినారు. వారి పేర్లు,1. చల్లా వెంకటేశ్వర్లు, కార్ డ్రైవర్ r/o ముస్తఫానగర్, ఖమ్మం N/O అన్నపరెడ్డిపల్లి గ్రామం, 2. దేవనబోయిన మహేష్ @ బాతు, బట్టల షాప్ సేల్స్ మాన్ r/o శ్రీరామ్ నగర్ కాలని, భద్రాచలం.

దొంగతనాలకు పాల్పడిన ముక్యమైన కేసుల వివరాలు:

1. తేది.14.5.2024 న సాయంత్రం 7 గంటల సమయం లో ఖమ్మం బై-పాస్ రోడ్ కొత్త బస్ స్టాండ్ వద్ద నుండి ఒక ఆడమనిషి RR స్కూల్ వైపు నడుస్తూ వెళ్ళుచుండగా, బైక్ పైన వచ్చి ఆమె మేడలో వున్న బంగారు చైన్ ను లాక్కొని పారిపోవడం జరిగింది.

2. తేది.12-03-2025 న రాత్రి సమయం లో స్కూటి పై రోటరీ నగర్ నందు తిరుగుచు ఒక తాళం వేసిన ఇంటి డోర్ తాళం పగల గొట్టి లోనికి ప్రవేశించి బంగారు వస్తువులను దొంగిలిచుకొని పోయినారు.

3. తేది. 08-04-2025 న సాయంత్రం 7.30 గంటల సమయం లో ఖమ్మం మామిళ్ళ గూడెం లో బైక్ పై వెళ్ళుచు, VVC ఫంక్షన్ హాల్ సమీపం లో ఒక ఆడ మనిషి చీకట్లో నడుస్తూ పోతుండగా, ఆమె మేడలో గొలుసు లాక్కొని పారిపోయినారు.

4. తేది. 04-07-2025 న పగలు బైక్ పై ఖమ్మం బై పాస్ రోడ్ లోని బ్యాంకు కాలని లో ఒక ఇంటి తాళం పగలగొట్టి బంగారపు వస్తువులు దొంగిలించినారు.

5. 5. తేది.27-07-2025 న రాత్రి బైక్ పై ఖమ్మం, కృష్ణవేణి స్కూల్ రోడ్ సహకారనగర్ లో ఇంటిలోకి ప్రవేశించి రెండు బీరువాల తాళాలు పగలగొట్టి దానిలో ఉన్న, వెండి వస్తువులు దొంగిలించినారు.

6. తేది.08-02-2025 న రాత్రి సంబాని నగర్ లో ఒక ఇంటిలోకి ప్రవేశించి బంగారు మరియు వెండి వస్తువులు దొంగిలించినారు.

7. తేది. 03-05-2025 న రాత్రి ఖమ్మం సంబాని నగర్ నందు ఒక తాళం వేసిన ఇంటి లోకి ప్రవేశించి బంగారు మరియు వెండి వస్తువులు దొంగిలించినారు.

వీటితో పాటు ఖమ్మం 1 టౌన్ (5), ఖమ్మం అర్బన్ (4), ఖమ్మం రూరల్ (2) బోనకల్ (2), కామేపల్లి(1) వెంసూర్(1), ఏన్కూర్ (1), సత్తుపల్లి(1)కొత్త గూడెం 3 టౌన్ (1) పోలీస్ స్టేషన్లు పరిదిలో మొత్తం (26) దొంగతనాలకు పాల్పడినారు.

రికవరీ చేసిన వస్తువులు:

1.రెండు బంగారు నాను త్రాడులు-45 గ్రాములు

2.రెండు బంగారు గాజులు-22.గ్రాములు

3.రెండు బంగారు చైన్స్, రెండు బంగారు రింగులు -40 గ్రాములు

4. నాలుగు జతల చెవి దిద్దులు-22 గ్రాములు

4.వెండి ప్లేట్-500 గ్రాములు

5. రెండు మోటార్ సైకిల్స్ మరియు ఒక స్కూటి,

6.32 ఇంచుల సోని కలర్ టీవీ నాలుగు సౌండ్ బాక్స్ లు.

మొత్తం బంగారు వస్తువులు 127 గ్రాములు,విలువ (13) లక్షలు, వెండి 500 గ్రాములు విలువ 65 వేలు,టీవీ మరియు సౌండ్ బాక్స్ లు విలువ 35 వేలు, మూడు మోటార్ సైకిల్స్ విలువ 2 లక్షలు, మొత్తం (16) లక్షల విలువైన వస్తువులను స్వాదీన పర్చుకోనైనది.

 

Related News

Select the Topic
Scroll to Top