ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 8 :
తెలంగాణలోని బీర్ అభిమానులకు ఇది కచ్చితంగా ఎగిరి గంతేసే వార్తే. హైదరాబాద్‌కే పరిమితమైన ట్యాబ్లూమ్ అనుభవం జిల్లాలకూ విస్తరిస్తోంది. హోటల్/రెస్టారెంట్ ప్రాంగణంలోనే చిన్న బ్యాచ్‌లుగా బీర్ తయారుచేసి, సర్వ్ చేసే తాజా బీర్ నేరుగా గ్లాస్‌లోకి వస్తుంది — అదే మైక్రో బ్రూవరీ మజా. ఇప్పుడు ఈ అనుభవం TCUR (Telangana Core Urban Region) ລ້ (బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదీగూడ, నిజాంపేట్, బడంగ్్పట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్)తో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ల వరకూ చేరబోతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 18 మైక్రో బ్రూవరీలు నడుస్తుండగా, ఇప్పుడు “ఫ్రెష్ ఆన్ ట్యాప్” అనేది స్టేట్‌వైడ్ థీమ్ కానుంది.















